📄 ePaper
Friday, July 24, 2026
HomeMANA MI VARTAవన మహోత్సవం వేడుకల్లో భాగంగా చర్ల తహసీల్దార్ కార్యాలయంలో మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభం.

వన మహోత్సవం వేడుకల్లో భాగంగా చర్ల తహసీల్దార్ కార్యాలయంలో మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభం.

📰 Generate e-Paper Clip

వన మహోత్సవం వేడుకల్లో భాగంగా చర్ల తహసీల్దార్ కార్యాలయంలో మొక్కల నాటే కార్యక్రమం ప్రారంభం.

చర్ల జూలై 02 మీ వార్త ప్రతినిధి: వన మహోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి అనూష, డిప్యూటీ కలెక్టర్ మురళి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, అది పెరిగే వరకు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెరగడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని, విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?