📄 ePaper
Friday, July 24, 2026
HomeMANA MI VARTAగిరి వికాసమే వనవాసీ కల్యాణ పరిషత్ ధ్యేయం.

గిరి వికాసమే వనవాసీ కల్యాణ పరిషత్ ధ్యేయం.

📰 Generate e-Paper Clip

గిరి వికాసమే వనవాసీ కల్యాణ పరిషత్ ధ్యేయం.

చర్లలో శబరి బాలికా నిలయాన్ని ప్రారంభించిన రామచంద్రయ్య.

గిరిజన బాలికల విద్యాభివృద్ధికి మరో ముందడుగు

చర్ల జూలై 02 మీ వార్త ప్రతినిధి: గిరిజన వికాసమే లక్ష్యంగా వనవాసీ కల్యాణ పరిషత్ పనిచేస్తోందని వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత ప్రశిక్షణ సదస్యులు కొరివింజ రామచంద్రయ్య అన్నారు. గిరిజన బాలికల కొరకు వనవాసీ ఆద్వర్యంలో చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన శబరి బాలికా విద్యాలయాన్ని రామచంద్రయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిలయ కార్యదర్శి బందా స్వరూపరాణి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడాను. వనవాసీ ఆద్వర్యంలో దేశ వ్యాపితంగా గిరిజన విద్యార్దుల కొరకు 254 విద్యార్ది నిలయాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో 206 బాలుర, 48 బాలికల నిలయాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బాలికా నిలయం చర్లలో ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ‌సంకల్పం ఉంటే ఏదయినా సాదించవచ్చనడానికి చర్లలో బాలికా నిలయం ఏర్పాటు వేయడమే నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే ఇక్కడ బాలుర కొరకు కొమరం భీం విద్యార్ది నిలయం నిర్వహిస్తున్నామని, దీనికి తోడుగా ఈ ప్రాంతంలో తిరగాడిన శ్రీరామచంద్రమూర్తి భక్తురాలు శబరి పేరిట బాలికా నిలయం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. త్వరలో దాత జవ్వాది కోదండరాంబాబు – సుమతి రామ్ దంపతులు విరాళంగా అందచేసిన జూనియర్ కళాశాల ఎదురుగా గల భూమిలో రూ. కోటి వ్యయంతో బాలికల కొరకు నూతన భవనం నిర్మిస్తామని వెల్లడించారు. అంత వరకు తాత్కాలికంగా వారి నివాసంలోనే నిలయం నిర్వహిస్తామని తెలిపారు. కొమరం భీం నిలయం అద్బుతంగా పనిచేస్తోందని, దీనికి సహకరించిన విదంగానే బాలికా నిలయంకు కూడా సహకరించి గిరి వికాసంలో ప్రతి ఒక్కరూ బాగస్వాములు కావాలని కోరారు. ఇటువంటి సమాజ హిత కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అదిలాబాద్ జిల్లా తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అదికంగా గిరిజనులు నివసిస్తున్నారని, వీరి కొరకు విద్యార్ది నిలయాలు, ఏకోపాద్యాయ పాఠశాలలు, వైద్యశిభిరాలను నిర్వహించి వారి సంక్షేమం కొరకు సంస్ద కృషి చేస్తోందని వెల్లడించారు. దేశం ప్రగతి పధంలో పయనించాలంటే మనలో చైతన్యం కలగాలని అన్నారు. ప్రతి హిందూవు మద్యం, గోమాంసంకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డాక్టర్ హెగ్డేవార్ ఒక్కరిగా ఆర్ ఎస్ ఎస్ ను ప్రారంబించారని నేడు లక్షల మంది కార్యకర్తలు కలిగి, ప్రపంచ వ్యాపితంగా విస్తరించి సమాజ వికాసంలో‌ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. హిందూ వికాసానికి కృషి చేసే సంఘ్ కు వందేల్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ వ్యాపితంగా మొదటి మొదటిసారి చర్లలో హిందూ సమ్మేళనం నిర్వహించామని ఇలా రాష్ట్ర వ్యాపితంగా 350 హిందూ సమ్మేళనంలను నిర్వహించగా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున హిందూ బందువులు తరలిరావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాశ్చాత్య సంస్కృతికి దూరంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వనవాసీ ప్రాంత విద్యా ప్రముఖ్ మైసర్ల శంకర్, ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, కోరం సూర్యనారాయణ, కోరెం రామారావు, తాటి పాపారావు, మల్లాది సుబ్రహ్మణ్యం, గొంది శోభన్‌బాబు, జవ్వాది మురళీకృష్ణ, గోగికార్ రాంలక్ష్మణ్, వేములపల్లి ప్రవీణ్ బాబు, శివరాజు కిషోర్, కీర్తి సురేష్, ఇరసవడ్ల రాము, మీసాల శ్రీనివాస్, శ్రీకర్, గాదె శంకర్ బాబు, నిలయ ప్రముఖ్ లు సాంబయ్య, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?