📄 ePaper
Wednesday, July 15, 2026
HomeMANA MI VARTAఘనంగా పిడమర్తి రమేష్ - సరిత దంపతుల 25వ,వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా పిడమర్తి రమేష్ – సరిత దంపతుల 25వ,వివాహ వార్షికోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా పిడమర్తి రమేష్ – సరిత దంపతుల 25వ,వివాహ వార్షికోత్సవ వేడుకలు.

సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేక ప్రార్థనలు.

కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ.

తల్లిదండ్రులను ఘనంగా సన్మానించిన కుమార్తె, కుమారుడు, బంధుమిత్రులు.

గార్ల జూలై 01 మీ వార్త ప్రతినిధి: 25వ,వివాహ వార్షికోత్సవ వేడుకలను పిడమర్తి రమేష్ – సరిత దంపతులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.గార్ల ఇందిరా నగర్ కు చెందిన రమేష్- సరిత దంపతులు వివాహ 25 ఏళ్ల వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. స్థానిక ఆర్ సీఎం చర్చిలో ఫాదర్ సాగర్ సంతోష్బి,ఫాదర్ ఫ్రాన్సిస్, సిస్టర్ మెర్సీ, కుచ్ తెరాస, సెల్లింన్ వివాహ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు సందేశాన్ని ఇచ్చారు. వివాహ వేడుకల సందర్భంగా రమేష్ దంపతులను ఆశీర్వదించారు. పరిశుద్ధ వివాహం జరిపి వారిని వారు ఆశీర్వదించారు. తల్లిదండ్రులను వారి కుమార్తె నిక్షిత, కుమారుడు నవనీత్, స్థానికులు, కాలనీవాసులు, క్రైస్తవ సోదరులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, బంధుమిత్రులు శాలువా కప్పి సత్కరించి వివాహ జూబ్లీ వేడుకలు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అందరూ కలిసి ప్రేమ విందును స్వీకరించారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?