📄 ePaper
Saturday, June 27, 2026
HomeMANA MI VARTAశ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం.

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం.

📰 Generate e-Paper Clip

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాస్త్రోక్తంగా పనులు చేపట్టాలి.

స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాచలం జూన్ 27 మన మీ వార్త ఇన్చార్జ్ రావడి రంజిత్ ఆనంద్: భారతదేశంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పునరుద్ధరణ పనులు ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా ప్రారంభించడం జరిగిందని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు.

శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆలయ పునరుద్ధరణ పనులు జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా ఉదయం 7.30 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం మాడవీధులు భక్తులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టి దేవస్థానమును టెంపుల్ సిటీగా రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 540 కోట్ల రూపాయలను మంజూరు చేసి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిగిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి చేతులు మీదుగా శంకుస్థాపన చేయించడం జరిగిందని, మొదటి విడతగా 350 కోట్లు విడుదల కాగా ప్రస్తుతం 200 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ దేవస్థానానికి భక్తులు అధికంగా వస్తున్నందున వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకునేలా సౌకర్యాలు కల్పిస్తూ పునరుద్ధరణ పనులు జరిపించడం జరుగుతుందని, 2027 జూన్ మాసంలో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఆలయ పునరుద్ధరణ పనులను ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పునరుద్ధరణ పనుల సందర్భంగా ఆలయ పవిత్రతకు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి నిర్మాణ ప్రక్రియను వేద పండితులు, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనల మేరకు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా, పనుల కారణంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి దర్శనం, నిత్య పూజలు, అర్చనలు, ఇతర సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, తాగునీరు, పరిశుభ్రత, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పునరుద్ధరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర రావు, ఇరిగేషన్ ఈ ఈ జానీ, భద్రాచలం డిప్యూటీ తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూణేం కృష్ణ, ఈవో గ్రామపంచాయతీ శ్రీనివాస్, వేద పండితులు, దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?