📄 ePaper
Tuesday, June 23, 2026
HomeMANA MI VARTAబదిలీ అయిన కామేపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మనోజ్ కు ఘన సన్మానం.

బదిలీ అయిన కామేపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మనోజ్ కు ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

బదిలీ అయిన కామేపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మనోజ్ కు ఘన సన్మానం.

సేవలు కొనియాడిన ఖాతాదారులు.

మేనేజర్ వృత్తికే మనోజ్ వన్నె తెచ్చారు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు.

కామేపల్లి జూన్ 20 మీ వార్త ప్రతినిధి:

కామేపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో
మేనేజర్ గా మూడేళ్లు పాటు పనిచేసి బదిలీ అయిన జి.మనోజ్ ను శనివారం ఖాతాదారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, సెర్ఫ్ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.స్థానిక బ్యాంకులో నిర్వహించిన కార్యక్రమంలో మేనేజర్ గా మూడేళ్లు పాటు బాధ్యత యుతంగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఖాతాదారులకు విశిష్ట సేవ లు అందించి బ్యాంకు సమగ్ర అభివృద్ధిక, బ్యాంకు లాభాల బాటలో పయనించేందుకు ఎనలేని విధంగా సేవలు అందిం చారని కొనియాడుతూ శాలువా కప్పి సత్క రించారు.రంగారెడ్డి రీజియన్ తూప్రాన్ బ్రాంచ్ మేనేజర్ గా బదిలీ కావడంతో
మేనేజర్ మనోజ్ ను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.మేనేజర్ వృత్తికి ఆయన వన్నెతెచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు కే.చంద్రశేఖర్, పి.భవాని, క్యాషియర్ ఎస్. వెంకటేశ్వరరెడ్డి, బ్యాంకు ఉద్యోగి టీ.యుగంధర్ సింహ, ఆర్కే పురం సర్పంచ్ అజ్మీర ద్వాలి చిన్న నాయక్, ఖాతాదారులు, గ్రామ పెద్దలు భాగం రంగారావు, కొనకంచి శంకర్ రావు, మల్లెంపాటి శ్రీని వాసరావు, సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి రాము, దీవెల రంగయ్య,కొమ్మినేని సత్య నారాయణ, పేరసాని వెంకటేశ్వర్లు, మోసం యుగంధర్, ప్రేమ్,సి సి బి.చైతన్య, కర్లపాటి రాజు,అజ్మీర మాన్సింగ్, అజ్మీర సుశీల, బొందల నాగమణి తదితరులు పాల్గొని మేనేజర్ మనోజ్ ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?