నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్ షిప్ రద్దు
మండల టాస్క్ ఫోర్స్ టీం.
కారేపల్లి జూన్ 19 మీ వార్త ప్రతినిధి: మండల కేంద్రమైన కారేపల్లి గ్రామంలో విత్తన దుకాణాలను మండల టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు మండల వ్యవసాయ అధికారి బట్టు శంకర్ ఎస్సై బైరు గోపీలు విత్తన నిల్వలు స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్ షిప్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూబీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కే ఎన్ ఎం 1638, డబ్ల్యూ జి ఎల్ 44, జేజేఎల్ 1798, 2 శ్రీరామ్, హెచ్ఎంటీ (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈఏడాది బోనస్ చెల్లిస్తుందన్నారు. వ్యవసాయశాఖ సూచించిన వంగడాలను మాత్రమే రైతులు సాగుచేయాల్సి ఉందన్నారు. విత్తన డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. అదే విధంగా నానో యూరియా వినియోగించాలని కోరారు. ప్రతి పెస్టిసైడ్, సీడ్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటుచేసి, అందులో సమగ్రంగా వివరాలు పొందుపర్చాలని సూచించారు., రైతులకు ఇచ్చే రశీదులను డీలర్లు ఇష్టానుసారం సొంతంగా ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తగిన పత్రాలు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

