దమ్మపేటలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై కేటీఆర్ అవినీతి, అక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పై చేసిన ఆరోపణలను ఖండించిన దమ్మపేట కాంగ్రెస్ శ్రేణులు.
దమ్మపేట జూన్ 19 మీ వార్త ఆర్ సి వనమాల శ్రీనివాసరావు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో రాహుల్ గాంధీ కీలకమైన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని, దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కక్కిరాల రమేష్ అన్నారు. శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలోని వై.ఎస్.ఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు తినిపించు కుంటూ వేడుకలు జరిపారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, హ్యాపీ బర్త్ డే టూ రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, అత్తులూరి వెంకట రామారావు మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని, ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా మన్మోహన్ సింగ్ ని ప్రధాని చేశారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, ఇందుకు ప్రతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అవినీతి, అక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంశాలను ప్రస్తావిస్తూ చేసిన విమర్శలు ఖండించిన దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి కనపడకపోతే మాట వస్తే చూపిస్తాం అని ఎద్దేవా చేశారు, పంచాయతీకి 10 సం.లలో 20 ఇండ్లు కట్టి, రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రభుత్వం నడిపిన వ్యక్తులా మా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాత మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని విమర్శించేది. స్వయాన కే.టి.ఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ‘వీకెండ్ ఎమ్మెల్యే’ అన్న మాట గుర్తులేదా కే.టి.ఆర్ కి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీకటి శ్రీనివాసరావు, చిన్నశెట్టి చిట్టిబాబు, గోపి, అప్పారావు, పగడాల కృష్ణారావు, కందుల వెంకటేశ్వరరావు, రాంశెట్టి పుల్లారావు, పగడాల కృష్ణారావు, గోపి, గట్ల సర్వేశ్వరావు,వనమాల శ్రీనివాసరావు, దేవయ్య, వేముల శ్రీను, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, కుప్పాల రాంబాబు, అన్నవరపు నాగేంద్రరావు, చిలకా శ్రీనివాసరావు, ధర్మసోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

