ఊట్కూరు రేగులకుంట లో ముమ్మరంగా ఉపాధి హామీ పనులు.
పనుల్లో పాల్గొన్న 190 మంది కూలీలు.
పూడికతీత పనులను పర్యవేక్షించిన ఫీల్డ్ అసిస్టెంట్ చంద్యా.
కామేపల్లి, జూన్ 19 మీ వార్త ప్రతినిధి: కామేపల్లి మండలం ఊట్కూరు రేగుల కుంటలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.కుంట అభివృద్ధి, పంటల సాగు, రైతు ప్రయోజనాలను కాంక్షిస్తూ కుంటలో పూడికతీత పనులను నిర్వహిస్తున్నారు. అట్టి పనుల్లో 190 మంది కూలీలు శుక్రవారం పాల్గొన్నారు. కుంటలో పూడికతీత పనులను కూలీల భాగస్వామ్యంతో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ చంద్యా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తూ ఎప్పటి కప్పుడు అట్టి పనులను ఫీల్డ్ అసిస్టెంట్ చంద్యా నాయక్ పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతి కూలీకి చేతినిండా పని కల్పించి ఉపాధి అవకాశాలను పెంపొందించి ఆర్థిక సమృద్ధిని కల్పించి ఇటు ప్రభుత్వ ఆశయం అటు కూలీల ఆకాంక్షలను నెరవేస్తున్నట్లు స్పష్టం చేశారు. తమ కృషికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎంపీడీవో జి. రవీందర్, ఏపీవో శ్రీరాణి, ఈసీ దామాల వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్సూ చనలకు అనుగుణంగా నిబంధనల మేరకు ఉపాధి హామీ పథకం పనులను నిర్వహిస్తున్నట్లు చంద్యా వెల్లడించారు. పని ప్రదేశంలో కూలీలకు తగిన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

