జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర సమాచారం దేశాభివృద్ధికి పునాది అని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.జనగణనపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియం నుండి జడ్పీ సెంటర్ వరకు నిర్వహించిన జనగణన అవగాహన వాక్ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, క్రీడాకారులు, ప్రజలు, వాకర్స్ తో కలిసి ర్యాలీ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా స్వీయ గణన విధానం మే 10 వరకు జరుగుతుందని, ఈ స్వీయ గణనలో స్వచ్చందంగా నమోదు చేసుకోసుకొని, ఈ స్వీయ నమోదు శాతాన్ని మరింతగా పెంచాలని, అందరూ ఈ స్వీయ గణనలో నమోదు చేసుకోవాలని కోరారు. మే 11వ తేదీ నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఇందులో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని, ఈ వివరాలు అంతా కూడా గోప్యంగా ఉంటుందని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, ప్రజలు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించిన సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అదే విధంగా జనగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన అవగాహన వాక్‌లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
జిల్లాలోని ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి జనగణన విజయవంతానికి సహకరించాలని కోరారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడుతుందని తెలిపారు.దేశ అభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాలు ఎంతో అవసరమని,మన సమాచారం మన భవిష్యత్తు అనే భావనతో ప్రతి ఒక్కరూ జనగణన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాస్, డీఎస్డీవో సునీల్ రెడ్డి, ఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, క్రీడాకారులు, యువత, విద్యార్థులు, నగర ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

