📄 ePaper
Thursday, May 21, 2026
Homeఆధ్యాత్మికంచెడుపై మంచి సాధించిన విజయానికి సాంకేతంగా జరుపుకునే పండుగ దసరా పండుగ

చెడుపై మంచి సాధించిన విజయానికి సాంకేతంగా జరుపుకునే పండుగ దసరా పండుగ

📰 Generate e-Paper Clip

మీ వార్త న్యూస్ 02అక్టోబర్ : వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. చిన్న వడ్డపల్లి చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన దసరా  ఉత్సవాలలో భాగంగా భారీ రావణాసురుని ప్రతిమను దహనం. రావణ దహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ వడ్డేపల్లి చెరువు సమీపంలో తొలిసారి ఏర్పాటు చేసిన రావణ వధ కార్యక్రమానికి గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  దసరా ఉత్సవాలలో భాగంగా భారీ రావణాసురుని ప్రతిమను దహనం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్స్ షో ఎంతగానో ఆకట్టుకున్నాయి…

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ;-

చెడుపై మంచి సాధించిన విజయానికి సాంకేతంగా జరుపుకునే పండుగ దసరా పండుగ అని తెలిపారు. భారతదేశ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. ఏనుమాముల పరిధిలోని చిన్న వడ్డపల్లి చెరువు సమీపంలో తొలిసారి ఇంత పెద్ద ఎత్తున రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించిన నిర్వకులను ఎమ్మెల్యే  నాగరాజు నిర్వాహకులను ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు…

దసరా పండుగ చెడుపై మేలుజయానికి ప్రతీక. రావణ వధ ఉత్సవం మన సమాజంలో సత్యం, ధర్మం ఎల్లప్పుడూ నిలుస్తాయనే సందేశాన్ని అందిస్తుంది. యువతలో మంచి విలువలు, సాంప్రదాయాల పట్ల గౌరవభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తం. సాంస్కృతిక విలువలు, భక్తి, ఐకమత్యం కలగలిపే ఉత్సవాలను ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలి. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతినిధులు, నాయకులు, నిర్వాహకులు, యువకులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

Previous article
Next article
చర్ల లో ఘనంగా బిజెపి 47.వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. చర్ల ఏప్రిల్ 06 మీ వార్త ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ వేడుకలు చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు నూప రమేష్ జెండా ఆవిష్కరణ చేశారు. బిజెపి శ్రేణులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని. పార్టీ కంటే దేశం ముఖ్యమనేది బిజెపి సిధాంతం అన్నారు. ఇద్దరితో మొదలైన ప్రయాణం నేడు కోట్ల మందికి చేరువైనది అని తెలిపారు. ఓటమికి కుంగని గెలుపుకు పొంగని నాయకత్వం బిజెపి విధానం అని అన్నారు. జాతీయవాదం తమ పార్టీ లక్ష్యం అని ఆయన తెలిపారు. స్వీట్లు, బిస్కెట్లు పంచారు. అదేవిధంగా కలివేరు గ్రామంలో క్రాస్ రోడ్ నందు పార్టీ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు గునూరి రమణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు బాబా ఫహీం, ఎంపీటీసీ ఇంచార్జి సరియం ధర్మరాజు, కార్యదర్శులు శ్రీనివాస్ చారి, విశ్వనాధం, బంధా మధు, వెంకటేష్, వినయ్, సమ్మయ్య, సందీప్, హరినాథ్, ఇర్ప సుబ్బారావు, లక్ష్మి, పొడియం జోగారావు, పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?