📄 ePaper
Wednesday, February 11, 2026
HomeMANA MI VARTAకొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో "మహాత్మా గాంధీ" జయంతి వేడుకలు.

కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో “మహాత్మా గాంధీ” జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

-గాంధీ జయంతి”రోజు ఆయన ఫోటోకి దండ వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్న కొప్పునూర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి

చిన్నంబావి : మండలo అక్టోబర్ 2  : మండల పరిధిలోని కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో గురువారం ఉదయం మహాత్మా గాంధీ జన్మదినం సందర్బంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ – గాంధీ 1869 అక్టోబర్ 2 వ తేదీన గుజరాత్ రాష్ట్రం లోని పోరుబందర్ అనే గ్రామంలో జన్మించారు.మన దేశానికి ఆంగ్లేయుల పాలన నుంచి శాంతియుత మార్గంలో పోరాడి స్వాతంత్రం సాధించిన ప్రముఖులలో ఒకరు.మన దేశానికి వ్యాపారం కోసమని. చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడే తిష్ట వేసి మన దేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టారు.మన దేశాన్ని వలస రాజ్యాంగా చేసుకుని మన మీదనే పెత్తనం చెలాయించారు.సాంసృతికంగా మన వికాసానికి అడ్డు తగిలారు.బహు విధాలుగా భారతీయులను వేదిస్తూ,దోచుకుంటూ మన దేశీయులను అనేక రకాలుగా అవమానించారు.మన దేశంలోనే మనల్ని రెండవ స్థాయి పౌరులుగా చేశారు.అంతులేని ఆగడాలకు పాల్పడ్డారు.దీంతో భారతీయుల సహనం నసించి బ్రిటిష్ వాళ్ళ దోపిడి అరికట్టడానికి ఎందరో పోరాట యోధులు వారితో దీర్ఘకాలం పోరాడి చివరికి సాధించగలిగారు.సత్యం,అహింస ఆయుధాలుగా సహాయ నిరాకరణ,సత్యాగ్రహం లక్షంగా ముందుకు సాగారు.గాంధీ భావనగర్లో ఉన్నత విద్య అభ్యసించి బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాద వృత్తి చేపట్టారు.చివరకు ఒకరోజు ప్రార్థన మందిరంలో కూర్చుని ప్రార్ధన చేస్తున్న సమయoలో 1948 అక్టోబర్ 30 వ తేదిన నాతూరామ్ గాడ్సే అనే వ్యక్తి తుపాకితో కాల్చి చంపాడు.జీవితంలో చివరివరకు అహింస,స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ,సత్య శోధనలో ఎదిగి ప్రపంచశాంతి కోరుకున్నారు.అదేవిధంగా గాంధీ గారి పేరు చాలా మందికి తెలుసు.కానీ,స్వాతత్రం కోసం పోరాడిన మరో యోధుడు,మన దేశానికి రెండవ ప్రధాని లాల్ బహద్దూర్ పేరు చాలా తక్కువ మందికే తెలుసు.జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో సైనికులు,రైతులను ఉత్తెజ పరచి 1965లో జరిగిన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అద్భుతమైన నాయకత్వ పటిమతో దేశాన్ని గెలుపు వైపు నడిపించిన ప్రముఖులలో ఒకరు.ఆయన నిరాడంబరుడు,నిజాయితీకి నిదర్శనం.ఆయన 1966లో తాస్కెంట్ లో మరణించిన తరువాత భారతదేశ ప్రభుత్వం అతనికి భారత రత్న అవార్డు ఇచ్చింది.ఈరోజు మహాత్మగాంధీ,లాల్ బహద్దూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్బంగా వారికి నివాళి అర్పిద్దాం అన్నారు.ఈరోజు వారిద్దరి జయంతి తో పాటు దసరా కూడా ఈరోజే కలిసి రావడం సంతోసించవలసిన విషయం.ఈ విజయదశమి అందరి జీవితాలలో,అన్ని రంగాలలో విజయం సిద్దించాలని ఆకాంక్షిoచారు.ఈ కార్యక్రమలో గ్రామస్థులు వర్కర్ నరేష్ పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?