అక్షర తపస్వికి అక్షర కిరీటం.
భద్రాచలంలో సత్తుపల్లి వాసికి అరుదైన గౌరవం.
సత్తుపల్లి సెప్టెంబర్ 20 మన మీ వార్త: కవిత్వమనేది కేవలం పదాల కూర్పు కాదు, అది సమాజపు అంతరంగాన్ని తట్టిలేపే అక్షర ఆయుధం, మహాకవి శ్రీశ్రీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలంలోని పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళావేదికపై జరిగిన 176వ జాతీయ ద్విశతాధిక కవి సమ్మేళనం అద్భుత ఘట్టాల నడుమ దిగ్విజయంగా ముగిసింది, ఈ సాహితీ సంగ్రామంలో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులైన కవి పోతర్లంక జయరామ్ తన గళంతో, కలంతో సత్తా చాటి అక్షర కిరీటి బిరుదు అందుకున్నారు. సాహిత్య సౌరభాల సమ్మేళనం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి సుమారు 200 మందికి పైగా లబ్ధప్రతిష్ఠులైన కవులు, రచయితలు ఈ వేడుకకు పోటెత్తారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. రాహుల్ ఐఏఎస్, శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం, జాతీయ ప్రణాళిక అధికారి పార్థసారథి, అధికార ప్రతినిధి జి. వరలక్ష్మి విచ్చేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ సమ్మేళనంలో సత్తుపల్లి కి చెందిన పోతర్లంక జయరామ్ గురు ఆవేదన అని వ్రాసిన తన యొక్క కవితను చదివి వినిపించారు. సమాజంలో గురువు పాత్ర, నేటి విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను హృద్యంగా అక్షర రూపంలోకి తెచ్చి సభికుల ప్రశంసలందుకున్నారు
భక్త రామదాసు వంశీయుల చేతుల మీదుగా ఘన సన్మానం.
ఉపాధ్యాయ లోకం పట్ల తన కవిత ద్వారా అమూల్యమైన భావాలను వ్యక్తపరిచిన జయరామ్‌ను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు, భక్త రామదాసు వంశీయుల ఆధ్వర్యంలో జయరామ్‌కు అక్షర కిరీటి బిరుదుతో పాటు జ్ఞాపిక అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానం జరిగింది. భద్రాచల గడ్డపై సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలను ఆయన ఇనుమడింపజేశారు.
అక్షరాల వెలుగులో సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కవుల కృషి ఎనలేనిది. జయరామ్ లాంటి కవులు ఇలాంటి జాతీయ వేదికలపై బిరుదులు అందుకోవడం సత్తుపల్లి సాహిత్య లోకానికి గర్వకారణం, పోతర్లంక జయరామ్ కు అక్షర కిరీటి బిరుదు రావడంతో సత్తుపల్లి మండలంలోని కవులు, శ్రేయోభిలాషులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

