📄 ePaper
Friday, July 24, 2026
HomeMANA MI VARTAభావి భారత ప్రధాని అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్.

భావి భారత ప్రధాని అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్.

📰 Generate e-Paper Clip

భావి భారత ప్రధాని అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్.

కామేపల్లి జులై 01 మీ వార్త ప్రతినిధి: కామేపల్లి మండలం పండితాపురం గ్రామం లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు, అఖిలేష్ యాదవ్ 52వ,జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.యాదవ సోదరులు, అఖిలేష్ యాదవ్ అభిమానులు, బీసీలు ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు యువత పాల్గొని జన్మదిన కేకు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ కూటమితో కూడిన ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ తర్వాత అఖిలేష్ యాదవ్ కి ప్రత్యేక స్థానం ఉన్నదని, యాదవ జాతి భారతదేశ ఆశా కిరణం అఖిలేష్ యాదవ్ తండ్రి సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, అఖిల భారత యాదవ మహాసభ నిర్మాణంలో దేశవ్యాప్తంగా, విస్తరింపజేసిన ప్రముఖులు ములాయం సింగ్ యాదవ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని, 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని ఒంటి చేత్తో తన పార్టీని గెలిపించుకొని కేవలం 38 ఏళ్ల వయసులో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు సీఎం గా పదవిని అలంకరించిన వ్యక్తి అఖిలేష్ యాదవ్ అని, ప్రస్తుతం లోక్ సభ ఎంపీగా, సమాజ్ వాది పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా, తన సతీమణి డింపుల్ యాదవ్ కూడా ఎంపీగా కొనసాగుతున్నారని తెలిపారు. ఒకపక్క రాజకీయాల్లో ఉంటూ, యాదవుల ఐక్యత కోసం దేశమంతటా పర్యటిస్తూ, యాదవులను చైతన్యం చేస్తూ పర్యటిస్తున్నారని, భావిభారత ప్రధానిగా నేడు యాదవులు కాంక్షిస్తున్నారని మల్లి బాబు యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేకల మల్లికార్జునరావు, బండిపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు గుగులోత్ రవి, షేక్ రబ్బానీ పాషా, శీలం పుల్లయ్య, బండి ఉపేందర్, జక్కంపూడి వెంకటేశ్వర్లు, పాటి బండ్ల ప్రసాద్,బాదావత్ నాగరాజు, కిషన్, నరేష్, మేకల లక్ష్మీనారాయణ, డేరంగుల తిరపయ్య, మొగిలి శ్రీను, లకావత్ నాగేష్, బద్రు, గుగులోత్ మదార్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?