భద్రాచలం మైనారిటీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ (కామర్స్) పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.
భద్రాచలం సెప్టెంబర్ 17 మన మీ వార్త:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గల టి జి ఎం ఆర్ & జెసి భద్రాచలం బాయ్స్-1 మైనారిటీ కళాశాలలో జూనియర్ లెక్చరర్ విభాగంలో వాణిజ్య శాస్త్రం (కామర్స్)లో ఒక ఖాళీ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. భద్రాచలం స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
విద్యా అర్హతలు: సంబంధిత విద్యా అర్హత ( ఎం కామ్ / బీఈడీ నోటిఫికేషన్ ప్రకారం). టి ఈ టి అర్హత కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలి.
దరఖాస్తుల సమర్పణ తేదీలు: 17.09.2026 నుండి 20.09.2026 వరకు సమయం: ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. దరఖాస్తులు సమర్పించాల్సిన ప్రదేశం: భద్రాచలం మైనారిటీ కళాశాల.
దరఖాస్తుతో జత చేయవలసిన ధ్రువపత్రాలు: బయోడేటా /దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్ స్టడీ సర్టిఫికెట్లు, విద్యా అర్హత సర్టిఫికెట్లు, టి ఈ టి అర్హత సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రాలు
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 6300871665, 8008099152
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

