*పత్రికసోషల్ మీడియాలో కత్తులతో పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్ – ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.*
*నిందితుడు ధన్గట్ సుధీర్, అరెస్టు రిమాండ్.*
*ఇదివరకే ఇతని పై 9 కేసులు నమోదు*
*మావలలో పశువుల వాహనాన్ని బెదిరించిన కేసు అయినప్పటినుండి పరారీ.*
*ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహారాష్ట్ర గడ్చిరోలి నందు నిందితున్ని పట్టుకున్న జిల్లా పోలీసులు.*
*నిందితుడి వద్ద నుండి ఒక తల్వార్ స్వాధీనం.*
*ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా, పబ్లిక్ స్థలాలలో కత్తులతో, డాగర్లతో ప్రదర్శనలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు.*
*నిందితుడి పై త్వరలో రౌడీ షీట్ ఓపెన్.*
ఆదిలాబాద్ పట్టణం కొత్త కుమ్మరివాడకు చెందిన నిందితుడు *ధన్గట్ సుధీర్* s/o శంకర్, మూడు నెలల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని మావల నందు పశువుల వాహనాన్ని ఆపి వాహన యజమానిని చంపుతానని బెదిరించి, డబ్బులు వసూలు చేసి దౌర్జన్యం చేసిన కేసులో పరారీలో ఉండడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కత్తులతో, డాగర్లతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా శాంతి భద్రత ల సమస్యలను తలెత్తెల ప్రయత్నించినందుకు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు, పబ్లిక్ స్థలాలలో కత్తులతో ప్రదర్శనలు చేసి, పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకొని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉండే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుడు గతంలో పశువుల వాహనం వద్ద డబ్బులు దౌర్జన్యం చేసిన కేసు, సోషల్ మీడియాలో కత్తులతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా ఉన్న కేసు, స్థానిక ఎగ్జిబిషన్ యజమాని వద్ద డబ్బులను దౌర్జన్యంతో అడిగిన కేసు, పట్టణంలో మొత్తం తొమ్మిది కేసులో నమోదు అయినదని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేసి తగు చర్యలు తీసుకోవడం పడుతుందని తెలిపారు. ఇతనిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఐరితాండకు సంబంధించిన ఆళ్లపల్లి అనే గ్రామంలో పట్టుకోవడం జరిగిందని అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇతని వద్ద నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పాత్రిక సమావేశంలో ఆదిలాబాద్ ఒకటో పట్టణ సిఐ బి సునీల్ కుమార్, మావల సీఐ కె స్వామి పాల్గొన్నారు.
ఇతనిపై జిల్లాలో నమోదైన కేసుల వివరాలు
1. Cr. No. 40/2018 Adilabad I Town. U/Sec. 188, 290 IPC of PS
2. Cr. No. 149/2023 U/Sec. 506, 324 IPC of PS Adilabad I Town.
3. Cr. No. 303/2024 U/Sec. 191 (2). 121 (1), 132, 190, 126 (2), 191 (3) BNS of PS Adilabad I Town.
4. Cr. No. 198/2025 U/Sec. 308 (5) BNS of PS Adilabad | Town:
The accused was threatened the one person, who run the exhibition in diet ground. Adilabad and demanded money to him by showing knife in public place.
5. Cr. No. 372/2024 U/Sec. 296 (b), 326 (g). 326 (f) r/w 3 (5) BNS of PS Adilabad II Town. In this case the accused set fire the auto.
6. Cr. No. 204/2024 U/Sec. 126 (2), 351 (3) BNS of PS Adilabad-Rural.
7. Cr. No. 42/2020 U/Sec. 324 r/w 34 IPC of PS Mavala.
8. Cr. No. 156/2025 U/Sec. 126 (2), 285, 351 (3) r/w 3 (5) BNS of PS Mavala.
9. Cr. No. 168/2025 U/Sec. 308 (5), 126 (2) r/w 3 (5) BNS of PS Mavala.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.