📄 ePaper
Wednesday, February 11, 2026
Homeతెలంగాణఎం.జె.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నవీన్ కుమార్ నియామకం...!

ఎం.జె.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నవీన్ కుమార్ నియామకం…!

📰 Generate e-Paper Clip

జహీరాబాద్,స్నేహిత ఎక్స్ ప్రెస్: మాదిగ జర్నలిస్ట్ ఫోరం సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కొనదొడ్డి నవీన్ కుమార్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని టీపీటీఎఫ్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం.జె.ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి డప్పు రామస్వామి,దేవరంపల్లి అశోక్  నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మరియు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా మాదిగ జర్నలిస్టుల ఫోరం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జహీరాబాద్ ప్రాంత జర్నలిస్ట్ కొనదొడ్డి నవీన్ కుమార్ ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ..మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా  ఏకగ్రీవంగా నియమించినందుకు పేరుపేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రత్యేకంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానన్నారు.జిల్లాలో ఉన్న మాదిగ జర్నలిస్టులకు వృత్తిపరంగా ఎలాంటి  సమస్యలు వచ్చిన తాను అండగా ఉండి పోరాటం చేస్తానని తెలిపారు.జహీరాబాద్ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల స్థానిక మాదిగ జర్నలిస్టులు మరియు తోటి జర్నలిస్టు మిత్రులు హర్షం వ్యక్త పరుస్తూ శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?