గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి
మఖ్తల్ నియోజకవర్గ ప్రతినిధి,అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): దేశంలో పరాయి పాలకులను పారదోల డానికి సత్య అహింస అనే ఆయుధంతోనే దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం పట్టణంలో రాయచూరు రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు,నేటి యువత గాంధీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని ముందు సాగాలని అప్పుడే సమాజ మనుగడ సజావుగా సాగుతుందని ఆయన అన్నారు. అహింసాని ఆయుధంతో ఎంతటి వారినైనా సన్మార్గంలో తీసుకొచ్చేంత శక్తి ఉందని భగవద్గీత శ్లోకాలను పట్టించిన ఆయన శాంతి సూక్తులతో మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం దేశంలోని ప్రజలందరినీ శాంతి సత్యం ఆయుధంతో ఎక తాటిపై స్వాతంత్రం సిద్ధించేలా పోరాటం చేశారని. ఈసిద్ధాంతాన్ని ప్రపంచంలోనే అనేక దేశాలన్నీ గుర్తించారని. ప్రపంచంలో ప్రస్తుతం కొన్ని దేశాల మధ్య జరుగుతున్న పోరాటాలను ఆపడానికి అమెరికా అధ్యక్షుడు సైతం శాంతి మంత్రం చెప్తున్నా రని నేటి యువత గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.
