📄 ePaper
Wednesday, February 11, 2026
HomeMANA MI VARTAఅంబరాన్ని తాకిన జనసేన దసరా సంబరాలు

అంబరాన్ని తాకిన జనసేన దసరా సంబరాలు

📰 Generate e-Paper Clip



– విజయదశమి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు

– అమ్మవారికి  పూల అలంకరణలతో ప్రత్యేక పూజలు

రాజమహేంద్రవరం, అక్టోబర్ 3: ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో విజయదశమి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని. నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటాను అని తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క నాయకునికి అర్థం అయి ఉంటుందని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని విషయాన్ని మీడియా ద్వారా ప్రజలతో ప్రజలతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావడం ఆయన అడుగుజాడల్లో నడవడం మా అందరికీ ఆనందదాయకమైన అని ప్రజలందరికీ న్యాయం జరగాలని లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారని గతంలో ఆయన ఓడిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే విధంగా వైఎస్ఆర్సిపి కు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని లక్ష్యం నెరవేరేందుకు ఒంటరిగా పోరాడిన ఆయన మనోధైర్యానికి  మరియు దృఢ సంకల్పానికి తలవంచుతు రాజమండ్రి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నేను ఆయన మార్గంలోని నడుస్తానని నా చివరి శ్వాస వరకు జనసేన ను వదిలిపెట్టనని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వచ్చిన జనసేన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్,  కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు గారు, మినీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ వేగుల లీలా కృష్ణ గారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ ప్రియా సౌజన్య గారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు. పత్తిపాడు జనసేన నాయకులు కత్తిపూడి బాబీ గారు. జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి గారు. కాకినాడ జనసేన నాయకులు తలాటం సత్య గారు రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జి అత్తి సత్యనారాయణ (అనుశ్రీ) మరియు జనసేన పార్టీ నాయకులు  ఎండోమెంట్ చైర్మన్లు డైరెక్టర్లు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?