ఉత్తమ సేవలకు అక్షర కిరీటి పురస్కారం.
భద్రాచలం, సెప్టెంబర్ 20 మన మీ వార్త:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేగడ, చర్ల మండలంలో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న యాక జయమ్మ ని విద్యారంగంలో అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఘనంగా సత్కరించారు.
శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 176వ జాతీయ సమ్మేళనం ఆదివారం భద్రాచలంలోని పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యాక జయమ్మ కి “అక్షర కిరీటి” ప్రశంసా పత్రంతో పాటు మెమొంటోను అందజేసి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, జీవశాస్త్ర బోధనలో, పాఠశాల అభివృద్ధిలో ఆమె అందిస్తున్న ఉత్తమ సేవలను ఈ సందర్భంగా వేదిక నిర్వాహకులు అభినందించారు.ఈ పురస్కారం లభించడం పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేగడ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, చర్ల మండలంలోని ఉపాధ్యాయులు, తేగడ గ్రామపంచాయతీ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయులు యాక జయమ్మ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు లభించే ఇటువంటి పురస్కారాలు మరింత స్ఫూర్తినిస్తాయని వారు పేర్కొన్నారు.
Discover more from mvartanews.com
Subscribe to get the latest posts sent to your email.

