📄 ePaper
Wednesday, February 11, 2026
HomeMANA MI VARTAజగదాంబ అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్

జగదాంబ అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్

📰 Generate e-Paper Clip


జీలుగుమిల్లి,( కృష్ణ మోహన్ ప్రత్యేక ప్రతినిధి) : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి పర్వదినం సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సమేతంగా జీలుగుమిల్లి జగదాంబ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద భవానీ మాల ధరించిన భవనీల ఇరుముళ్ళూ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే తాటియాకులగూడెం లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించారు ఎల్లమ్మ గుడి వద్ద నిర్వహించిన భవాని ఇరుముళ్ళు కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మండల కేంద్రంలో కొలువైయున్న జగదాంబ అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహించారని  ప్రజలందరికీ జగదాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని  ఒకరోజు పండుగ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అలాంటిది దసరా వేడుకలు ఇన్ని రోజులు ఘనంగా నిర్వహించిన జగదాంబ  ఆలయ కమిటి చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు ని ఎల్లమ్మ గుడి నిర్వాహకులు మూర్తి రాజు, కనకదుర్గమ్మ ఆలయ నిర్వాహకులు చోడిశెట్టి సత్య సూర్య ప్రసాద్ చోడిశెట్టి దుర్గా సుభాష్ లను అభినందించారు అలాగే ఎల్లమ్మ గుడి వద్ద కనకదుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కోలా.ధర్మరాజు  కొప్పుల దుర్గారావు, చిర్రి కృష్ణ, కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.


Discover more from mvartanews.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page

Need Help?