ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ నేత రాహుల్ నిరంతర పోరాటం. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
మాజీ మండల అధ్యక్షుడు చంద్ర ప్రకాష్
కారేపల్లి జూన్ 19 మీ వార్త ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకై స్వామి పరిరక్షణకై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నిరంతర పోరాటం కొనసాగిస్తున్నాడని మాజీ సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి తన నివాసంలో శుక్రవారంకాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్రకాష్ మాట్లాడుతూ.. పదవులు కాదు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండాగా ప్రతి కార్యకర్త పాటుపడాలని రాహుల్ సంకల్పాన్ని ఆచరించాలన్నారు. , దేశ ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్న యువనేత అన్నారు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. నేడు ప్రతి నేత రాహుల్ ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు పట్టుదలతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షర్టు వీరభద్రం, శంషుద్దీన్, పాటి నరసయ్య, చాంద్ పాషా, కాపు సుధాకర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.