పండితాపురం లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.
రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు.
కామేపల్లి, జూన్ 19 మీ వార్త ప్రతినిధి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన బిజెపి మతతత్వ శక్తుల దుర్మార్గాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సమ సమాజ సాధన కొరకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి భావి భారత దిక్సూచి రాహుల్ గాంది అని వారి కుటుంబం చేసిన త్యాగం ఎన్నటికీ ఈ దేశం మరిచిపోదని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు, టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఫతే మహమ్మద్, పిఎసిఎస్ అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూరి శివయ్య అన్నారు.
రాహుల్ గాంధీ 56వ, జన్మదినోత్సవం సందర్భంగా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతా లో నేరుగా డబ్బులు జమచేయడం జరిగిందని రైతులు హర్షం ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తో పాటు భారీ కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం కోసం అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చారని, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మతతత్వ శక్తులు, విద్రోహుల చేతిలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారని, వారి వారసుడు రాహుల్ గాంధీ ఈ రోజు దేశం కోసం,ప్రజలందరి బాగుకోసం తమ జీవితాన్ని పణంగా పెట్టి ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారని, అలాంటి వ్యక్తి భారత దేశ ప్రధానమంత్రి అయితే ఈ దేశం సుభిక్షంగా, అందరి జీవితాలలో వెలుగులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిధంగా రాష్ట్రంలో ఎస్ ఐ ఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నదని, జాగ్రత్తగా దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పర్యవేక్షించాలని, అప్రమత్తంగా లేకపోతే పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో దుర్మార్గంగా ఓట్లను తొలగించినట్లుగా మన దగ్గర కూడా జరిగే అవకాశం ఉందని, ఈ జూన్ 25 నుండి జూలై 24 వరకు జరిగే సర్వేలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాలోత్ సరిరాం నాయక్, సర్పంచులు
ధరావత్ అనురాధ, లకావత్ సునీత, భాష, రెడ్డి, ఉప సర్పంచ్ మేకల మల్లికార్జునరావు, ఏఎంసి డైరెక్టర్ గబ్రు నాయక్, గుగులోతు రవి, పండగ కోటి,నరాటి చందర్రావు, కోటయ్య,సత్తి వీరబాబు, కొమ్మినేని శ్రీనివాసరావు, పాటిబండ్ల ప్రసాద్,బొడ్డు లక్ష్మి నారాయణ,చల్ల మల్లయ్య, బాదావత్ నాగరాజు,శీలం పుల్లయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, కాట్రాల వీరబాబు,సత్తిరెడ్డి,ఇమ్మడి రామనాథం,ఉప్పగండ్ల వీరభద్రరావు, అయితనబోయిన విఠల్, మొగిలి శ్రీను, బుచ్చయ్య లాల, మున్నా, సన్నీ, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ గా పాల్గొన్నారు.