mvartanews.com
Newspaper Banner
Date: 14 June 2026, 3:50 am Edition: MANA MI VARTA DESK

ఎలెక్ట్రానిక్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం… ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ భద్రాచలం రెండవ నూతన కమిటీ ఎన్నిక.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం… ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ భద్రాచలం రెండవ నూతన కమిటీ ఎన్నిక.సర్వ సభ్యసమావేశంలో పాల్గొన్న 20 మంది ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఏకగ్రీవంగా నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది. రెండవ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు కుప్పాల నాగరాజు,గౌరవ సలహాదారులు పూనెం ప్రదీప్ ఆధ్వర్యంలో రెండవ నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.రెండవ నూతన కమిటీ ఎలెక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పోకల శ్రీనివాస్ (v6 news),కార్యదర్శిగా చెట్టి జస్వంత్(99టీవీ క్రైమ్ బ్యూరో),కోశాధికారి గా లంకా రాజేష్ (రాజ్ న్యూస్),ఉపాధ్యక్షుడు తమ్మల్ల రాజేష్(Y7 న్యూస్ బ్యూరో),సహాయ కార్యదర్శిగా పోలిశెట్టి రాజు(స్వతంత్ర టీవీ) ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది…గత ఏడాది మీడియా ప్రెస్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో బాధ్యతలు నిర్వహించిన మొదటి కమిటీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కొత్త కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అందరికీ అందుబాటులో ఉంటూ,ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి,అధికారులకు తెలియచేస్తూ ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపారు. ప్రజా సమస్యలను మీడియా ప్రెస్ క్లబ్ కి తెలియచేయాలని,మీడియా ప్రెస్ క్లబ్ అందుబాటులో ఉంటుంది అని తెలిపారు…