అంగన్ వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం.
కామేపల్లి, జూన్ 19 మీ వార్త ప్రతినిధి: కామేపల్లి మండలం ముచ్చర్ల సర్పంచ్ జాటోత్ జాయ్ లూసి 2,3 అంగన్ వాడి సెంటర్ లో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పల్లె దవాఖాన లో వర్షాకాలం లో ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందిని కోరారు. రోగులకు అందించే షుగర్,బిపి, జ్వరం మాత్రాలను పరిశీలించారు. అనంతరం ఓల్డ్ వాటర్ ట్యాంక్ మెట్లకు పెయింటింగ్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, పిల్లలు వారి తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.