తెలంగాణపై నిప్పుల వర్షం.. 48 డిగ్రీలకు చేరుకొనున్న ఉష్ణోగ్రతలు, రెడ్ అలర్ట్ జారీ.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. మే 14వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల కాస్త ఉపశమనం లభించినప్పటికీ.. ఇకపై భానుడి భగభగలు రెట్టింపు కానున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరనుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.