mvartanews.com
Newspaper Banner
Date: 10 May 2026, 6:25 am Edition: MANA MI VARTA DESK

వేంకటేశ్వరస్వామి దేవస్థాన భూముల కౌలు వేలం.

వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామంలో గల,శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాలయానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు హక్కుల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. కందుకూరు, భరణిపాడు గ్రామాల పరిధిలో ఉన్న అగ్రహారం భూములను 2026-2027, 2027-2028 సంవత్సరాలకు సంబంధించిన రెండు సంవత్సరాల కాలానికి కౌలు కాస్తు చేసుకునే హక్కును బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు వివరించారు. ఈ వేలం కార్యక్రమం ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించ  బడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, కౌలుదారులు వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన అధికారులు కోరారు.