ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లోని శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారి దేవస్థానం నీలాద్రి నందు ది.05.05.2026 నుండి ది.09.05.2026 వరకు జరుపబడుచున్న ప్రతిష్ట, కుంబాభిషేకం కార్యక్రమంలో చివరి రోజు యాగశాలలో మూలమంత్ర హోమాలు జరుపబడినవి ఉదయము 9.51నిమిషములకు ధ్వజస్తంభ పరివార దేవత యంత్ర ప్రతిష్ట కార్యక్రమం రాజగోపుర ప్రతిష్ట కార్యక్రమంలో కార్యక్రమాలు శ్రీ సదానంద మఠాధిపతులు శ్రీ గురుమదానంద సరస్వతి పీఠాధిస్వర్లు పరమహంస పరిగరాజకాచార్యులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య కరకమలములచేత అత్యంత వైభవంగా నిర్వహించబడింది తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుపబడినది 11 నిమిషములకు స్వామివారిచే కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సాయి కమిషనర్ వీరస్వామి ఇన్స్పెక్టర్ సమత పాల్గొన్నారు. తదుపరి మహానదాన కార్యక్రమం జరబడింది. తదుపరి శాంతి కళ్యాణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాల స్వీకరించినారు.