చర్ల లో ఘనంగా బిజెపి 47.వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
చర్ల ఏప్రిల్ 06 మీ వార్త ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ వేడుకలు చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు నూప రమేష్ జెండా ఆవిష్కరణ చేశారు. బిజెపి శ్రేణులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని. పార్టీ కంటే దేశం ముఖ్యమనేది బిజెపి సిధాంతం అన్నారు. ఇద్దరితో మొదలైన ప్రయాణం నేడు కోట్ల మందికి చేరువైనది అని తెలిపారు. ఓటమికి కుంగని గెలుపుకు పొంగని నాయకత్వం బిజెపి విధానం అని అన్నారు. జాతీయవాదం తమ పార్టీ లక్ష్యం అని ఆయన తెలిపారు. స్వీట్లు, బిస్కెట్లు పంచారు. అదేవిధంగా కలివేరు గ్రామంలో క్రాస్ రోడ్ నందు పార్టీ జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యవర్గ సభ్యులు గునూరి రమణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు బాబా ఫహీం, ఎంపీటీసీ ఇంచార్జి సరియం ధర్మరాజు, కార్యదర్శులు శ్రీనివాస్ చారి, విశ్వనాధం, బంధా మధు, వెంకటేష్, వినయ్, సమ్మయ్య, సందీప్, హరినాథ్, ఇర్ప సుబ్బారావు, లక్ష్మి, పొడియం జోగారావు, పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.