mvartanews.com
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 10:34 am Digital Edition : MANA MI VARTA NEWS

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన

న్యూఢిల్లీ,స్నేహిత ఎక్స్ ప్రెస్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామి కవేత్త అదానీపై అమెరికా లో కేసు నమోదైన నేప థ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టా లంటూ గత కొన్నిరోజులుగా పార్ల మెంటు లోపల, వెలుపల విపక్ష సభ్యులు ఆందోళ చేస్తున్న విషయం తెలిసిందే.

మంగళవారంసైతం విపక్ష పార్టీల సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ చిత్రాలతో పాటు ‘మోదీ అదానీ భాయ్ భాయ్’ నినాదాలతో ముద్రించిన బ్యాగులు చేత్తో పట్టుకొని పార్లమెంటు వద్ద కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.

ప్రియాంక చేతిలోని ఆ బ్యాగును పరిశీలించి చూడండి ఎంత క్యూట్ గా ఉందో’ అంటూ రాహుల్ పేర్కొన్నారు. ఆ బ్యాగ్ పై ఒకవైపు మోదీ, మరోవైపు అదానీ బొమ్మ ఉంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అని రాసిఉంది.

ఇంతలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. సభా కార్యక్రమాల్లో మేం పాల్గొనాలనుకుంటున్నాం. కానీ, ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదని అన్నారు. ఏదో ఒక సాకుతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారని ప్రియాంక అన్నారు.