mvartanews.com
Newspaper Banner
Date: 15 November 2024, 8:20 am Edition: MANA MI VARTA NEWS

విద్యార్థులకు దుస్తువులు వితరణ<br><br>

సిరికొండ,స్నేహిత ఎక్స్ ప్రెస్: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో125 మంది విద్యార్థులకు కరీంనగర్ జిల్లాకు చెందిన దోస్తీ పేస్ట్ గ్రూప్ చొప్పదండి శ్రీనివాస్ మరియు వారి మిత్రులు కాపర్తి చంద్రశేఖర్, నాలమంచు విజయ్,కట్టుకో జ్వాల రాజేష్(యుఎస్ఏ),షోరుపాక దీపక్,చందర్,బుక్క స్వరూప, రాణి,రూ.60 వేల విలువ గల టీ షర్ట్స్ మరియు ప్యాంట్స్ ఉచితంగా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తోటరాని, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.