mvartanews.com
Newspaper Banner
Date: 15 November 2024, 10:53 am Edition: MANA MI VARTA NEWS

దేగుల్ వాడిలో వీధి కుక్కల దాడి… 16 మేకలు మృతి….!  <br><br>– దుఃఖంలో బాధితుడు ఉప్పరి. రాంచందర్ <br>– <br>– చోద్యం చూస్తున్న మండల అధికారులు

కంగ్టి,స్నేహిత ఎక్స్ ప్రెస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగుల్ వాడి గ్రామంలో శుక్రవారం వీధి కుక్కలు రెచ్చిపోయయి.గ్రామానికి చెందిన ఉప్పరి రాంచందర్,మేకలపై కుక్కలు దాడి చేశాయి.ఈ దాడిలో 16 మేకలు మరణించాయి.దీంతో లబ్దిదారుడు తీవ్రఆవేదనకు గురయ్యారు నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆదుకోవాలని దుఃఖంతో వేడుకొన్నారు.ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది ఇప్పటి కైన జిల్లా మరియు మండల అధికారులు స్పందించి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని గ్రామప్రజలు డిమాండ్ చేశారు.ఈ విషయంపై అధికారులు అలసత్వం వహిస్తే కుక్కలతో మనుషుల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.